Home క్రైమ్ సముద్ర స్నానానికి వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతు

సముద్ర స్నానానికి వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతు

406
0

చీరాల : సముద్ర స్నానానికి చీరాల మండలం వాడరేవు వచ్చిన గుంటూరు జిల్లా చౌదవారం ఆర్వీఆర్ ఇంజినీరింగ్ కాలేజీ ఈఈఈ ద్వితీయ సంవత్సరం విద్యార్థి హరిప్రసాద్(18) సముద్రపు అలల ధాటికి గల్లంతయ్యాడు.

గుంటూరు జిల్లా చౌదవరం ఆర్వీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ట్రిపుల్ ఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన హరిప్రసాద్ అనే విద్యార్థి చీరాల మండలం వాడరేవు సముద్ర స్నానానికి తోటి మిత్రులతో ఆదివారం వచ్చాడు. సముద్ర స్నానం చేస్తూ అలల తాకిడికి నీటిలో మునిగి పోయాడు. విషయం గమనించిన మత్స్యకారులు విద్యార్థికోసం గాలిస్తున్నారు. స‌ముద్ర స్నానానికి ముందు తీసుకున్న సెల్ఫీ ఫోటో చూసిన మిత్రులు, బంధువులు, త‌ల్లిదండ్రులు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. అప్ప‌టివ‌ర‌కు త‌మ‌తో ఆనందంగా గ‌డిపిన మిత్రుడు ఒక్క‌సారిగా నీట‌మునిగి క‌నిపించ‌క‌పోవ‌డంతో ఖిన్నుల‌య్యారు.