బాపట్ల : అర్ధరాత్రి… ఓ యువకుడు … యువతిపై బలత్కారం చేయబోయిన ఘటన కంకటపాలెంలో చోటు చేసుకుంది. ఆ అవమానం భరించలేక యువతి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అది గమనించిన యువతి బంధువులు వెంటనే పొన్నూరులోని ప్రవేటు వైద్యశాలకు తరలించారు. వైద్యశాలకు వెళ్లడంతో ఈ ఘటన అల్యస్యంగా వెలుగు చుసింది. యువతి ఆత్మహత్య యత్నం విషయం తెలుసుకున్న బలత్కారం చేసేందుకు ప్రయత్నించిన యువకుడు కూడా పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అతన్నీ వైద్యశాలకు తరించినట్లు సమాచారం. యువకుని వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు యత్నించినట్లు బాధిత యువతి కంకటపాలెంకు చెందిన తిరుపతమ్మ చెబుతుంది.