Home గుంటూరు పోలీసు అనుమ‌తి లేకుంటే…?

పోలీసు అనుమ‌తి లేకుంటే…?

325
0

బాప‌ట్ల : వినాయ‌క విగ్ర‌హాలు ఏర్పాటు చేసుకునేందుకు పోలీసు అనుమ‌తి తీసుకోవాల‌ని ఎస్ఐలు అనిల్‌కుమార్‌రెడ్డి, హ‌స్స‌న్ పేర్కొన్నారు. నిబంధ‌న‌ల‌కు లోబ‌డే విగ్ర‌హాలు ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. పోలీసు అనుమ‌తి లేకుండా విగ్ర‌హాలు పెట్టినా, నిమ‌జ్జ‌న స‌మయంలో అల్ల‌ర్లు, గొడ‌వ‌లు జ‌రిగినా విగ్ర‌హ క‌మిటీ స‌భ్యులే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌న్నారు. ఎలాంటి అవాంచ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నా క‌మిటి స‌భ్యుల‌పై కేసులు న‌మోదు చేస్తామ‌న్నారు.