Home క్రైమ్ ఢిల్లీలో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై…

ఢిల్లీలో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై…

452
0

డిల్లీ: చట్టాలు ఎన్ని ఉన్నా… ఎలాంటి శిక్షలు వేస్తున్నా… చిన్నారులపై అకృత్యాలు ఆగడంలేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ మానవ మృగం అరాచకానికి మరో చిన్నారి బలైంది. పాఠశాల ఆవరణలోనే ఆరేళ్ల చిన్నారిపై అదే పాఠశాలలో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్‌ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆగస్టు 8న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..

డిల్లీలోని గోలే మార్కెట్‌ ప్రాంతానికి చెందిన ఓ ఆరేళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. బుధవారం సాయంత్రం ఆ చిన్నారి స్కూలు నుండి బయటకు వస్తుండగా అదే పాఠశాలలో పనిచేసే ఎలక్ట్రీషియన్‌ ఆ చిన్నారిని ఆపాడు. అక్కడి నుంచి స్కూల్‌లోని ఓ గదిలోకి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాసేపటికి పాఠశాల నుంచి ఏడుస్తూ చిన్నారి ఇంటికి తిరిగొచ్చింది. చిన్నారి ఏడుపు చూసిన ఆమె తల్లి ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు చిన్నారిని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు. వైద్యులు అత్యాచారం జరిగినట్లు ధ్రువీకరించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. చిన్నారి సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట చిన్నారులు, మహిళలు లైంగికదాడులకు గురవుతున్నారు. ఇలాంటి దాడులను అరికట్టేందుకు ఇటీవలే కేంద్రప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. 12ఏళ్లలోపు పిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా చట్టం రూపొందించారు. అయినా ఇలాంటి దాడులు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.