చీరాల : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైసిపి నేతల ఆందోళన ఉదృతం చేశారు. ఎంపిల ఆందోళనకు మద్దతుగా తహశీల్దారు కార్యాలయం ఎదుట రిలేదీక్షలు చేస్తూనే కేంద్ర ప్రభుత్వ కార్యాలయం పోస్టాఫీసు ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నా నుద్దేశించి వైసిపి అధికార ప్రతినిధి యడం రవిశంకర్, నీలం జేమ్స్ మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధించే వరకు వైసిపి పోరాటం చేస్తుందన్నారు. జగన్ మొదటి నుండి ప్రత్యేక హోదా కోసం కట్టుబడి ఉన్నట్లు చెబుతున్నాడని గుర్తు చేశారు.
జగన్ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా తాము పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షులు బొనిగల జైసన్‌బాబు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి కొండ్రు బాబ్జి, కోడూరి ప్రసాదరెడ్డి, ఎం రాంబాబు, మాచ్చుస్, గొట్టిపాటి చిట్టిబాబు, గోలి వెంకట్రావు, వాసిమళ్ల వాసు, వాసిమళ్ల శ్రీను పాల్గొన్నారు.