Home విద్య సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో వెల్డింగ్ టెక్నాలజీపై వర్క్ షాప్

సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో వెల్డింగ్ టెక్నాలజీపై వర్క్ షాప్

382
0

చీరాల : సెయింట్ ఆన్స్ ఇంగినీరింగ్ కాలేజీలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో వెల్డింగ్ టెక్నాలజీ పై వేసవి శిక్షణ తరగతులు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. శిక్షణ పొందిన విద్యార్థులకు నైపుణ్యాభివృద్ది సంస్థ జిల్లా మేనేజర్ ఎస్కె మీరావళి చేతులమీదుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఎస్ ఇంద్రనీల్, రామకృష్ణారెడ్డి, దయాకర్, హారిక, వెంకట్ పాల్గొన్నారు.