టంగుటూరు : వెలగపూడి గ్రామస్తులు వైఎస్ఆర్‌సిపి నియోజకవర్గ నాయకులు వరికూటి అశోక్‌బాబు మద్దతుతో తహశీల్దారు కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. గ్రామస్థుల స్థలాన్ని టిడిపి సర్కారు ఆక్రమించిందని ఆరోపించారు. కాంగ్రేస్ ప్రభుత్వం కాలంలో ఎస్‌సిలకు 33 లేఅవుట్‌లలో 19ప్లాట్లు ఒకసారి 11ప్లాట్లు ఒకసారి ఇచ్చారు. వాటిలో 3ప్లాట్లు ఉమ్మడి అవసరాల కోసం కేటాయించారు. ఖాళీగా ఉన్న మూడు ప్లాటులలో ముగ్గురు ఇల్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు ఒక ప్లాటులో సిట్టింగ్ ఎంఎల్ఎ చెప్పాడని టీడీపీ మద్దతుదారుడు భవనం నిర్మించుకున్నాడని ఆరోపించారు. గ్రామస్థుల ఉమ్మడి స్థలాన్ని కాపాడాలని కోరుతూ అశోక్‌బాబు మద్దతుతో సుమారు 100మందికిపైగా తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం తహశీల్దారుకు వినతి పత్రం అందజేశారు. పరిష్కారం కాకుంటే ఆందోళన మరింత తీవ్రం చేయాల్సి వస్తుందని సూచించారు.