Home ప్రకాశం కొండెపి టిడిపిలో రోడ్డెక్కిన అసమ్మతి

కొండెపి టిడిపిలో రోడ్డెక్కిన అసమ్మతి

724
0

కొండెపి : అసమ్మతి సెగ టిడిపిని ఆవహించింది. అధికార పార్టీ ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయులు కు వ్యతిరేకంగా వేదిక ఏర్పాటు చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎస్సి కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ అనుచరులు టిడిపి పరిరక్షణ కమిటీ పేరుతో సభ నిర్వహించడం నియోజకవర్గంలో రాజకీయ చర్చకు దారితీసింది.

కొండపిలో అసమ్మతి వర్గం ర్యాలీ చేశారు. అనంతరం గుడిపల్లి చందు కళ్యాణ మండపంలో సభ నిర్వహించారు. సభకు డైరీ మాజీ అధ్యక్షుడు కంచర్ల ప్రసాదు అధ్యక్షత వహించారు. పారిశ్రామిక వేత్త చింతల వెంకటేశ్వర్లు మాట్లాడారు. హాజరైన కార్యకర్తలనుద్దేశించి “పార్టీ మనది. పార్టీలోకి ఎంతోమంది వస్తుంటారు. పోతుంటారు. మనం శాశ్వితం.” అన్నారు. సమస్యలు తీరుస్తాడాని గెలిపిస్తే మనకే సమస్య అయి కూర్చున్నాడని ఎమ్యెల్యే స్వామినుద్దేశించి అన్నారు. అధికార పార్టీలో ఉంటూ కేసులు, బెదిరింపులకు గురవుతున్న పరిస్థితి ఉందన్నారు. అలాంటి వాటినీ అధిగమించి ఇంతమంది హాజరయ్యారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు అన్నారు.

ఎమ్మెల్యేగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలా కాకుండా కార్యకర్తలపై కేసులు పెట్టించి బెదిరింపులకు గురిచేస్తే ఇబ్బందులు తప్పవన్నారు. నియోజకవర్గ పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళతామన్నారు. పార్టీ ఎవరికి సీటు ఇచ్చినా గెలిపిస్తామని చెప్పారు. సభలో కునంనేని రమేష్, మారెడ్డి సుబ్బారెడ్డి, పాతూరి రామారావు, పూర్ణ సుధాకర్, కొమ్మలపాటి రాఘవరావు, చుక్కా కిరణ్ కుమార్, సలీంబాషా, సన్నబోయిన మాలకొండయ్య, కొనికి వెంకటేశ్వర్లు, పాలడుగు శింగయ్య, పి శ్రీనివాసరావు, పమిడి వెంకటేశ్వర్లు, నన్నం చెన్నయ్య, కల్లగుంట రామారావు, నెలపాటి బ్రహ్మయ్య, పులి జయరావు, కొత్తపల్లి శేషయ్య, కాగడాల శింగయ్య, పిడికేటి ఎల్లమంద, మారం నాగేశ్వరరావు, గోగినేని ప్రసాద్, చింతల సుబ్బారావు, పమిడి వెంకటసాయి పాల్గొన్నారు.