Home జాతీయం కెసిఆర్ ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తిస్తున్నాం : త‌మ్మినేని

కెసిఆర్ ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తిస్తున్నాం : త‌మ్మినేని

307
0

న‌ల్గొండ : జాతీయ రాజ‌కీయాల్లో కాంగ్రెస్‌, బిజెపికి ప్ర‌త్యామ్న‌యంగా తృతీయ ఫ్రంట్ ఏర్పాటుపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్లు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌బ‌ద్రం ప్ర‌క‌టించారు. పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న విలేక‌ర్ల‌తో మాట్లాడారు. కేసీఆర్ తృతీయ ఫ్రంట్‌ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరుగుతాయ‌న్నారు. అయితే జాతీయ రాజ‌కీయాల‌లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే ధైర్యం కేసీఆర్, చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని స్ప‌ష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు రావని పేర్కొన్నారు.