Home విద్య పరీక్షలలో విజయం కోసం చిట్కాలు

పరీక్షలలో విజయం కోసం చిట్కాలు

909
0

*పరీక్షలలో విజయం కోసం చిట్కాల*

🧘‍♀ *1. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయంలో తప్పక ధ్యానం చేయండి.*

🖊 *2. మరుసటి రోజు పరీక్షకు కావలసిన సామాగ్రి ముందు రోజే సర్ది వుంచుకోండి. (హల్ టికెట్, పెన్సిల్, పెన్, జామెట్రీబాక్స్…)*

🧘‍♂ *3. పరీక్షకు ముందు పుస్తకాలు పక్కన పెట్టి చక్కగా “విజువలైజేషన్”* *చేసుకోండి. అనగా మీకు కావలసిన ఫలితం అందినట్లు, మీరు సంతోషంగా వున్నట్లు ఊహించుకోండి.*

🌹 *4. పరీక్ష హాలులోకి ప్రశాంతమైన మనస్సుతో,నవ్వుతూ ప్రవేశించండి.*

📋 *5. పరీక్షాపత్రం తీసుకున్న తర్వాత పూర్తిగా ఒకసారి చదివి, కాసేపు కళ్ళు మూసుకుని రెండు నిమిషాలు ధ్యానం చేసి మీకు కావలసిన ప్రశ్నలను మాత్రమే గుర్తుకు తెచ్చుకోండి.*

🌹 *6. పరీక్ష వ్రాసి వచ్చిన తర్వాత ఆ పరీక్ష ఎలా వ్రాసినా దాన్ని గురించి మరచిపోయి మరుసటి రోజు సబ్జక్ట్ చదవాలి.*

🖍 *7. పరీక్ష వ్రాసేటప్పుడు ముఖ్యమైన Formulas, Definitions, years, Names అన్నింటికీ బాక్స్ వేయాలి. వ్రాసేలైను ముఖ్యమైనది. అయితే లైను క్రింద అండర్ లైను చేయాలి.*

🖊 *8. పరీక్షలో బాగా తెలిసిన ప్రశ్నలకు ముందు చక్కగా జవాబులు వ్రాయాలి. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.*

🧘‍♂ *9. పరీక్షలో టెన్షన్, ఒత్తిడి, అలసటకి పరిష్కారం- ధ్యానం “ఇచ్చిన సమయంలో” ప్రశ్నలకు తగిన జవాబు వ్రాయండి*.

✏ *10. అక్షరాలు గుండ్రంగా వ్రాయాలి. కొట్టివేతలు, దిద్దుబాట్లు, అక్షరదోషాలు, వ్యాకరణదోషాలు ఉండరాదు.వంకర టింకరగా లైన్లు వ్రాయరాదు.*

📋 *11. పరీక్ష సమయానికి పది నిమిషాలు ముందే వ్రాయడం పూర్తి చేసి ఆఖరున చెక్ చేసుకోవాలి.*

📖 *12. 50కి 30 మార్కులు వస్తుంటే, మిమ్మల్ని మీరు వచ్చిన మార్కులకు అభినందించుకుంటూ, ఇక మిగిలిన 20 మార్కుల సాధనపై దృష్టి పెట్టండి.*

🧘‍♂ *13. అలసట పోవటానికి రిలాక్స్ అవ్వండి. ఇంట్లో వాళ్ళతో,స్నేహితులతో కాసేపు సరదాగా మాట్లాడటం ద్వారా మరి ధ్యానం ద్వారా*

📱 *14.టీవీ గేమ్స్ సెల్ ఫోన్లను పూర్తిగా విడిచి పెట్టండి.*

🧘‍♀ *15. టెన్షన్ పోయి, అటెన్షన్(శద్ధ) రావాలంటే ధ్యానం సులభ మార్గం.*

📋 *16. భయం వల్ల టెన్షన్, టెన్షన్ వల్ల జ్ఞాపకశక్తి క్షీణించడం తద్వారా పరీక్ష సరిగా వ్రాయలేక పోవడం సహజం. “నేను పరీక్ష అద్భుతంగా వ్రాయగలను” అన్న నమ్మకం ఎప్పుడూ వుండాలి. ఆ నమ్మకం పెరగడానికి ధ్యానమే అద్భుత పరిష్కారం.*

🧘‍♂ 17 *ఎల్లప్పుడూ పాజిటివ్ మాటలు మాట్లాడండి. నేను ఇంకా మంచి మార్కులు తెచ్చుకో గలను. నేను చక్కగా పాస్ కాగలను. యత్ భాషణం తత్ భవతి (ఎలాంటి మాటలోఅలాంటి జీవితం, ఫలితాలు. )*

🌹 *18.సినిమా హాల్ కు ఎంత రిలాక్సడ్ గా వెళతామో,పరీక్ష హాల్ కు అంతే రిలాక్సడ్ గా వెళ్ళాలి.*

🧘‍♀ *19.పరీక్ష హాల్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. దీనివలన అనవసర భయాలు పోయి పాజిటివ్ ఆలోచనతో పరీక్షలో విజయం సాధిస్తారు.*
.
🧘‍♂ *20.తక్కువ మార్కులు వచ్చాయంటే తక్కువ శ్రద్ధ చూపినట్లు. ఎక్కువ మార్కులు రావాలంటే ఎక్కువ శ్రద్ధ చూపాలి. అంతే తప్ప ఏ విద్యార్థి తక్కువ కాదు .*

🌹 *21.మీరు బలహీనంగా వున్న సబ్జెక్టులకు మీ ఉపాధ్యాయుల సహకారంతో ఎక్కువ సమయం కేటాయించండి. ఎందుకంటే అన్ని సబ్జెక్టులూ మీకు ముఖ్యమైనవే.*

🧘‍♀ *22.ఒక సబ్జెక్టు చదివేటప్పుడు పూర్తిగా ఆ సబ్జెక్ట్ మీదనే ధ్యాస వుంచాలి. ఇతర సబ్జెక్టుల బాకీలు గుర్తుకు వచ్చినా ప్రస్తుతం ఆ సబ్జెక్టు చదవడమే నా పని అనుకుని కొద్దిసేపు ధ్యానం చేసి తిరిగి చదవడం కొనసాగించాలి.*

📖 *23. చదివిన వాటిని మననం చేసుకోవడం చాలా ముఖ్యం*.

🌹 *24.చదువును ఇష్టపడి చదవాలి. కష్టపడి కాదు.*

🌹 *25. మీ మిత్రుల యొక్క విజయాలను చూసి ఆనందించండి. అభినందించండి. దానివలన ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ఆ విజయాలు భవిష్యత్తులో మీకూ స్వంతం అవుతాయి.*

🌹 *26. రాత్రిలు ఎక్కువ సమయం మేల్కోవడం మంచిది కాదు. ఉదయం 4 గంటలకు నిద్ర లేవటం మంచిది*.

🧘‍♀ *27.ఆహార నియమాలు తప్పక పాటించాలి. మితాహారం శాకాహారం మాత్రమే తీసుకోవాలి. నూనె వంటలు తీసుకోవద్దు. వీలైన ఎక్కువసార్లు నీళ్లు తాగండి*
.
🌹 *28.మీకు మంచి జీతం, జీవితం, తల్లిదండ్రుల సంతోషం, సమాజంలో గౌరవం, మీరూ మీ చుట్టూ వున్న వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండే వ్యక్తిత్వానికి, అద్భుతమైన వెలుగు చదువు అని ప్రతిరోజూ గుర్తుంచుకోండి.*

🌹 *29.జీవితం విలువ జీవితంలోఈ వెలుగు విలువ తెలుసుకోండి.*

🌹 *30.పెట్రోలు నింపుకునేందుకు టైమ్ లేదు అనుకుంటే, లక్షల రూపాయల బైక్ కూడా కొంత దూరం తర్వాత ఆగిపోతుంది. కనుక శరీరం, మనస్సు ఆరోగ్యంగా వుంటూ బుద్ధి వికసించాలంటే ప్రతి ఒక్కరికీ “ధ్యానం” అనే ఇంధనం తప్పనిసరి.*