చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు నలుగురు ఇన్‌ఫోసిస్‌కు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఇటీవల విజయవాడ లయోలా ఇంజనీరింగ్ కళాశాలలో ఆంద్రప్రదేశ్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ అకాడమి ఆధ్వర్యంలో జరిగిన ఇన్‌ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ సెలక్షన్స్‌లో ప్రకాశం జిల్లా చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన నలుగురు బిటెక్ విద్యార్ధులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. సిఎస్ఇ విభాగానికి చెందిన పి మేఘన, సిఇసి విభాగం నుండి సిహెచ్ భానుశ్రీ, సౌదాగర్ ఆలియా, సి సత్యశ్రీవాసవి ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్ధులకు సంవత్సరానికి రూ.3.25లక్షల వేతనం ఇతర అలవెన్సులు ఇస్తారని ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఎన్ పూర్ణచంద్రరాబు తెలిపారు.
ఈసందర్భంగా కళాశాల ఆవరణలో జరిగిన అభినందన సభలో మాట్లాడుతూ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం నుండి సాప్ట్‌స్కిల్స్, తృతీయ సంవత్సరం నుండి టెక్నికల్ ట్రైనింగ్‌లో ప్రోగ్రామింగ్, కోడింగ్‌పై మెళుకువలు నేర్చకోవటం వలన ఇతర కళాశాలల కన్నా ఎక్కువమంది విద్యార్ధులు ఉద్యోగాలకు ఎంపికవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిఎస్ఇ హెచ్ఒడి డాక్టర్ పి హరిణి, ఇసిఇ హెచ్ఒడి డాక్టర్ కె జగదీష్‌బాబు పాల్గొన్నారు.