Home ఆంధ్రప్రదేశ్ నిండుకుండ‌లా శ్రీశైలం జలాశయం : దిగువకు లక్షా 4వేల క్యూసెక్కులు విడుదల

నిండుకుండ‌లా శ్రీశైలం జలాశయం : దిగువకు లక్షా 4వేల క్యూసెక్కులు విడుదల

536
0

శ్రీ‌శైలం (సున్నిపెంట) : రెండు తెలుగు రాష్ట్రాలకు కీలక ప్రాజెక్టైన‌ శ్రీశైలం జలాశయం నిండింది. వ‌ర‌ద ఉద్రుతి పెర‌గ‌డంతో గేట్లు తెరిచారు. ఎగువ ప్రాంతాల నుండి భారీగా వ‌చ్చి చేరుతున్న వరద నీటితో జలాశయం జలకళను సంతరించుకుంది. జలాశయం సామ‌ర్ధ్యం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881 అడుగులకు నీరు చేరింది. ఎగువ నుండి వరద ఉదృతి ఉండ‌టంతో ముందు జాగ్రత్తగా నీటిని దిగువకు విడుదల చేయాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శ‌నివారం కృష్ణమ్మకు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. సారె సమర్పించారు. అనంతరం జలాశయం 5, 6, 7, 8 నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువ‌కు విడుదల చేశారు. ఈ నాలుగు గేట్ల ద్వారా లక్షా 4వేల క్యూసెక్కుల నీళ్లు దిగువ‌కు వ‌స్తున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో 3,62,098 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 1,03,857 క్యూసెక్కులుగా ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. కృష్ణమ్మ పరవళ్లతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.