Home ప్రకాశం న్యాయ విజ్ఞాన స‌ద‌స్సుల్లో న్యాయ‌మూర్తులు కృష్ణ‌న్‌కుట్టి, శ్రీ‌నివాస‌రావు

న్యాయ విజ్ఞాన స‌ద‌స్సుల్లో న్యాయ‌మూర్తులు కృష్ణ‌న్‌కుట్టి, శ్రీ‌నివాస‌రావు

654
0

చీరాల : మున్సిప‌ల్ కార్యాల‌యంలో జ‌రిగిన న్యాయ విజ్ఞాన స‌ద‌స్సులో సీనియ‌ర్ సివిల్ జ‌డ్జి ఎస్ కృష్ణ‌న్‌కుట్టి మాట్లాడారు. ప్ర‌జ‌ల‌కు చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా నేరాలు అదుపు చేయ‌డంతోపాటు పాల‌నా సౌల‌భ్యం ఉంటుంద‌ని చెప్పారు. అందుకు త‌గిన‌ట్లు చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల్సి ఉంద‌న్నారు. మున్సిప‌ల్ కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో క‌మీష‌న‌ర్ షేక్ ఫ‌జులుల్లా, ఒక‌టో ప‌ట్ట‌ణ సిఐ వి సూర్య‌నారాయ‌ణ‌, బార్ అసోసియేష‌న్ కార్య‌ద‌ర్శి గౌర‌వ ర‌మేష్‌బాబు, సీనియ‌ర్ న్యాయ‌వాది, మున్సిప‌ల్ స్టాండింగ్ కౌన్సిల్ ఎంవి చ‌ల‌ప‌తిరావు పాల్గొన్నారు.

కొత్త‌పేట నారాయ‌ణ స్కూల్, మ‌ధ‌ర్‌తెరిస్సా స్కూల్‌ ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన న్యాయ‌విజ్ఞాన స‌ద‌స్సులో జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన చేసుకోవాలని సూచించారు. ప్రతి నిత్యం మనం చేసే పనిలో చట్టాలు ఇమిడి ఉంటాయని చెప్పారు. చ‌ట్టాల‌ను తెలుసుకోవ‌డం ద్వారా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన జీవితం అల‌వాట‌వుతుంద‌న్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి గౌరవ రమేష్, స్కూల్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.