Home ప్రకాశం ఆడ‌పిల్ల‌లు ప్ర‌లోభాల‌కు లోను కాకూడ‌దు

ఆడ‌పిల్ల‌లు ప్ర‌లోభాల‌కు లోను కాకూడ‌దు

357
0

వేట‌పాలెం : ఆడ‌పిల్ల‌లు ఎవరైనా పెట్టే ప్ర‌లోభాల‌కు లోను కాకూడ‌ద‌ని, ఎవ‌రైనా ప‌దేప‌దే వెంబ‌డిస్తే షీటీం పోలీసుల దృష్టికి తీసుకురావ‌ల‌ని ఎఎస్ఐ రాంబాబు సూచించారు. త‌ల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి వెంబ‌డించే వారిని హెచ్చ‌రించాల‌ని చెప్పారు. గుడ్ ట‌చ్‌, బ్యాడ్ టచ్ అంశంపై విఠ‌ల్‌న‌గ‌ర్ ఎస్ఎఆర్ఆర్ఎం ఉన్న‌త పాఠ‌శాల‌, మ‌న విద్యా పాఠ‌శాల‌ల్లో సోమ‌వారం స‌ద‌స్సులు నిర్వ‌హించారు. పాఠ‌శాల‌లో అయితే ప్ర‌ధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాల‌ని చెప్పారు. బాగా చ‌దివి మంచి మార్కుల‌తో పాసైతే ఉన్న‌త చ‌దువుల‌కు వెళ్ల‌వ‌చ్చ‌ని, వెకిలి చేష్ట‌లకు పాల్ప‌డితే జైలుకు వెళ‌తార‌ని చెప్పారు. కార్య‌క్ర‌మంలో కానిస్టేబుళ్లు మాణిక్య‌రావు, శివ‌కుమార్‌, శ్రావ‌ణి, పావ‌ని, చంద్రిక‌, సుధారాణి, ప‌ర్చూరు ఎస్ఐ రామ‌కృష్ణ పాల్గొన్నారు.