జరుగుమల్లి : నర్సింగోలు గ్రామానికి చెందిన మణికొండ శ్రీనివాసరావు, రవిళ్ళ వెంకటేశ్వర్లు, చెన్నారెడ్డి లక్ష్మయ్యకు రైతురాధం పధకం ద్వారా ప్రభుత్వం నుండి రాయితీపై మంజూరైన ట్రాక్టర్లును కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి , టీడీపీ యువనాయకులు దామచర్ల సత్య బుధవారం అందజేశారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు పోకురి రవీంద్ర బాబు, ఎంపీపీ పోటు పద్మావతి, సీనియర్ నాయకులు పోటు పెదబాబు, మాజీ సర్పంచ్ పాతురి కోటేశ్వర రావు, ఎంపీటీసీ పాల్గొన్నారు.