డిల్లీ: రాజ్యసభలో ఆంద్రప్రదేశ్ ఎంపిలు ఆందోళనకు దిగారు. ఎపి ప్రతినిధుల ఆందోళనతో ఉదయం నుండి సభ వాయిదా పడుతూ వచ్చింది. ఎన్ని వాయిదాలు పడినా రాజ్యసభలో ఆందోళన పరిస్థితి మారడం లేదు. వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభను తిరిగి ప్రారంభించారు. ప్రత్యేక హోదా అంశం తేలాల్సిదేనని పట్టుబట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాల్సిందేనంటూ ఏపీ ఎంపీలు సభలో ఆందోళన చేపట్టారు. ఛైరన్మన్ వెల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ఎంతగా వారించినా సభ్యులు వినిపించుకోలేదు.
ఇదే సమయంలో కావేరీ జల వివాదంపై అన్నాడీఎంకే సభ్యులు సైతం ఆందోళన చేపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు.