Home ప్రకాశం గంజాయి, గుట్కా స్వాధీనం

గంజాయి, గుట్కా స్వాధీనం

362
0

చీరాల : చీరాల – బాపట్ల మెయిన్ రోడ్డులోని ఆటో నగర్ వద్ద చీరాల రూరల్ సిఐ పి భక్తవత్సలరెడ్డి, ఈపురుపాలెం ఎస్ఐ హానోక్, సిబ్బంది సహాయంతో తనకు రాబడిన సమాచారం మేరకు గంజాయిని, నిషేధిత గుట్కా ప్యాకేట్స్ ను అక్రమంగా రవాణా చేసి వ్యాపారం చేయుచున్న కంకనాల సత్యన్నారాయణను అరెస్ట్ చేశారు. మార్కెట్ బజారు, బాపట్ల వద్ద షేక్ నాగూర్ అనేవారిని అరెస్ట్ చేశారు. రవాణా చేయుచున్న రూ.లక్ష విలువైన ఆరు గోతల గుట్కా ప్యాకేట్స్, షుమారు కేజి గంజాయిని స్వాధీనం చేసుకున్నారూ. నేరానికి ఉపయోగించిన ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంకు హానిచేసి నిషేధిత మత్తు పదార్థాలు రవాణాని అరికట్టి వారిని అరెస్టు చేసిన చీరాల రూరల్ సిఐని, ఈపురుపాలెం ఎస్ఐ, సిబ్బందిని చీరాల Dsp గారు అభినందించారు..