Home ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ మద్దతు వారికే…

పవన్ కళ్యాణ్ మద్దతు వారికే…

502
0

అమరావతి : పెట్రోలు ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ధరలపై విపక్షాలు అన్ని ఓకేవేడికపైకి వస్తున్నాయి. ఈ నేపద్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. పెట్రోల్ ధరలకు నిరసనగా ఈ నెల 10వ తేదీన కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా హర్తాళ్‌కు పిలుపునిచ్చాయి. సాధారణంగా హర్తాల్ కు వ్యతిరేకంగా ఉండే ఆయన ఈ హర్తాళ్‌కు తమ పార్టీ మద్దతునిస్తున్నట్లు వెల్లడించారు. ఈ హర్తాళ్‌లో పాల్గొనాలని కార్యకర్తలకు ట్విట్టర్లో పిలుపునిచ్చారు.

‘‘ పెరుగుతున్న పెట్రోల్ ధరలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పెట్రోల్‌ను గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకురావాలని జనసేన డిమాండ్ చేస్తూనే వుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే మనదేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతుండటం గర్హనీయం. అందుకే ఈ నెల పదో తేదీన జరగునున్న జాతీయ హర్తాళ్‌కు జనసేన మద్దతు ఇస్తుంది.” అని పేర్కొన్నారు.

హర్తాళ్‌లో కార్యకర్తలు శాంతియుతంగా పాల్గొనాలని సూచించారు. హర్తాళ్‌లో పాల్గొనాలని ఆహ్వానించిన సిపిఎం కార్యదర్శి పి మధు, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, పిసిసి ఆధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డికి కృతజ్ఞతలు – జైహింద్’’ అంటూ జనసేన ట్వీట్ చేసిన లేఖలో పవన్ పేర్కొన్నారు. తాము స్వతహాగా బందులకు వ్యతిరేకమని చెప్పే పవన్ వివిధ సందర్భాల్లో విపక్ష పార్టీల ఆందోళనలకు మద్దతు పలికిన సంగతి విధితమే…!