Home క్రైమ్ ప్రేయసి అలిగిందనీ… ఊరంతా బ్యానర్లు కట్టి…

ప్రేయసి అలిగిందనీ… ఊరంతా బ్యానర్లు కట్టి…

587
0

ముంబయి :  అందరం సినిమాలు చూస్తాం. కానీ సినిమాల్లో సన్నివేశాల్ని అనుకరించాలని అనుకోమ్. నితిన్ హీరోగా సదా హీరోయిన్ గా నటించిన జయం సినిమా చేసే ఉంటారు. అందులో హీరోయిన్ సదాను మెప్పించేందుకు సారీ, క్షమించు అంటూ పపెరిపై రాసుకుని వీపుకు అంటించుకుని హీరో నితిన్ పడిన కష్టాలు సినిమాలో చూసాం. కానీ అలాంటి సన్నివేశమే పూణేలో చోటుచేసుకుంది.

‘సారీ’ పేరుతో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో పాటలు కూడా వచ్చాయి. ఇలా కాకుండా ప్రియురాలు అలక తీర్చేందుకు వినూత్నంగా ప్రయత్నించాడు ఓ అపర ప్రేమికుడు. ఆమె రోజూ వెళ్లే దారిలో, నగరంలోని ప్రధాన కూడళ్లలో ‘శివ్‌దే ఐ యామ్‌ సారీ’ అంటూ బ్యానర్లు కట్టించాడు. ఈ ప్రేమికుని అత్యుత్సాహం పోలీసులకు తలనొప్పులు తెచ్చింది.

పుణెలోని పంప్రి చించ్వాడ్‌ కు చెందిన వ్యాపారవేత్త నీలేశ్‌ ఖేడేకర్‌ అనే వ్యక్తి చేసిన ఘన కార్యమే ఇది. తన ప్రేయసితో స్వల్పంగా గొడవపడ్డాడు. దీంతో ఆమె అలకబూనింది. ఆమె కోపాన్ని తగ్గించేందుకు వినూత్నంగా సారీ చెప్పాలనుకున్నాడు. ఆమె రోజు వెళ్లే దారిలో, పట్టణంలోని ఇతర రద్దీప్రాంతాల్లో పెద్ద పెద్ద బ్యానర్లు, హోర్డింగ్‌లు కట్టించాడు. గత శుక్రవారం నగరంలో అక్కడక్కడా బ్యానర్లు, హోర్డింగ్‌లు చూసిన పోలీసులు స్టెన్ అయ్యారు.

వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బ్యానర్లు కట్టించిన వ్యక్తి గురించి ఆరా తీశారు. అతను వ్యాపారవేత్త నిలేశ్‌ అని గుర్తించారు. అనుమతుల్లేకుండా అక్రమంగా ఇలా బ్యానర్లు కట్టడం నేరమని చెప్పారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.