చీరాల : ఇందిరా గాంధీ 108 వ జయంతి సభను కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పుల మాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్నో మహత్తర కార్యాలు చేశారన్నారు. ఆమె ప్రవేశపెట్టిన పధకాలు గుర్తుతెచుకొని మరల కాంగ్రెస్ను కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఆంధ్రప్రదేష్కు ప్రత్యేక హోదా సాధ్యమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సయ్యద్ అలీమ్బాబు, నాయకులు కొండ్రు రత్నబాబు, గజవల్లి వినయ్ పాల్గోన్నారు.