చీరాల : శుగరుతో బాధపడేవాళ్ళు కేవలం మందులపై ఆధార పడకుండా ఆహార నియమాలు పాటించాలని డాక్టర్ రాజరాజేశ్వరి చెప్పారు. వాడరేవు రామనంద సరస్వతి ఆశ్రమం ఆవరణలో ఆదివారం షుగరు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రోగులకు వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా నెలరోజులకు సరిపడు మందులు అందజేశారు. శిబిరంలో 1522మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
శిబిరంలో డాక్టర్ ఎం రాజరాజేశ్వరి తోపాటు డాక్టర్ కమలారాజేశ్వరి, డాక్టర్ లలిత్ ప్రకాష్ చంద్ర, డాక్టర్ పేట శ్రీకాంత్, డాక్టర్ టి సుధాకర్ యాదవ్, డాక్టర్ రవికాంత్ వైద్య పరీక్షలు చేశారు. రోగులకు అల్పాహారం, తాగునీరు వంటి సౌకర్యాలను ట్రస్ట్ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, మేనేజర్ ఎన్ సురేష్ ఆధ్వర్యంలో గోపాల్, బసవరావు, ఎంజి శంకరరావు, ఎ సురేష్, వాడరేవు ఉన్నత పాఠశాల, చీరాల మహిళా కళాశాల విద్యార్థులు కల్పించారు.