చీరాల : రాత్రి 9గంటలు దాటితే పట్టణంలోని డాక్టర్లు ఎవ్వరూ నాడిపట్టకుండా నిరాకరించిన రోజులవి. అత్యవసర వైద్య సహాయం అవసరమైతే గుంటూరు, విజయవాడ పరుగులు తీసే పరిస్థితి ఉండేది. గుండెజబ్బులు, యాక్సిడెంట్లు వంటి కేసులకు గుంటూరు తీసుకెళ్లేలోపు మార్గమద్యలో ప్రాణాలొదిలిన ఘటనలు చూసే ఉంటాం. అలాంటి రోజుల్లో అప్పటి వరకు కామాక్షి పాలిక్లినిక్‌గా ఉన్న వైద్యశాల అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని శ్రీకామాక్షి కేర్ హాస్పిటల్‌గా చర్చిరోడ్డులో సురేష్‌మహల్ పక్కన వెలసింది. అప్పటి నుండి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సంజీవినీలా కామాక్షి కేర్ హాస్పిటల్ సేవలందిస్తుంది.
24గంటలు అందుబాటులో వైద్యబృంధం
ఒకరు కాదు. ఇద్దరు కాదు. ఎంఎస్ జనరల్ సర్జన్, యాక్సిడెంట్ కేసుల స్పెషలిస్ట్, మత్తు వైద్యులు, ఎముకల వైద్యులు ఇలా అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగికి అందించాల్సిన వైద్యానికి సంబంధించిన 9మంది వైద్యబృంధం, లేబరేటరీలు 24గంటలు అందుబాటులో ఉంటారని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, బ్రెయిన్ స్ర్టోక్, హార్ట్ ఎటాక్‌లతో వచ్చేవారికి క్షణాల్లో వైద్యం అందించి రోగి ప్రాణాలు కాపాడుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పథకాలకు అనుబంధ వైద్యశాలగా
ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన ఎన్‌టిఆర్ వైద్యసేవ, ఆరోగ్య రక్ష, ఉద్యోగ వైద్యభీమా వంటి పథకాలకు అనుంబధ వైద్యశాలగా గుర్తింపు పొందినది. ఎన్‌టిఆర్ వైద్యసేవ ద్వారా అన్ని రకాల జబ్బులకు వైద్యసేవలందిస్తున్నారు. అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సలూ చేస్తున్నారు. ఎన్‌టిఆర్ వైద్యసేవ ద్వారా ఆపరేషన్లు చేయించుకున్నవారికి వైద్యంతోపాటు ఉచితంగా మందులు, పరీక్షలు చేస్తారని ఎన్‌టిఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్ రాజేష్ తెలిపారు. ఉద్యోగ వైద్యభీమా (ఇహెచ్ఎస్), మెడికల్ ఫీజు రీఎంబర్స్‌మెంట్, సిఎంఆర్ెఫ్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.
వైద్యబృంధం : డాక్టర్ ముద్దన నాగేశ్వరరావు, ఎంబిబిఎస్, డిఎ
చీరాల ప్రజలకు గత కొన్ని దశాబ్దాలుగా అనస్తీసియా సేవలు అందిస్తూ క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ కేర్ నందు ఎంతో అనుభవం ఉన్నటువంటి డాక్టర్ ముద్దన నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పురుగు మందు, పాముకాటు, విషజ్వరాలు, ఆయాసం, గుండెనోప్పి, దీర్ఘకాలిక నయం కాని జబ్బులతో బాధపడే వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
డాక్టర్ చలువాది వెంకటేశ్వర్లు, ఎంఎస్., ఆర్థో
గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ చదివారు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజిలో ఎంఎస్ ఆర్థో చేశారు. 2012నుండి 17మద్య కాటూరి మెడికల్ కాలేజిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం కామాక్షి కేర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. యాక్సిడెంట్ కేసులు, మోకాళ్ల నొప్పులు, నడుము, మెడ, కీళ్ల నొప్పులు, విరిగిన ఎముకలకు ప్రత్యేక చికిత్స చేస్తారు. అన్ని రకముల ఆపరేషన్లు చేస్తారు. రాడ్స్, ప్లేట్స్ వేస్తారు. సి-ఆర్ెం మిషన్ ద్వారా ఆపరేషన్లు చేస్తారు. ఎన్‌టిఆర్ వైద్యసేవ ద్వారా అన్న రకాల ఆపరేషన్లు ఉచితం.
డాక్టర్ గడ్డం శ్రీకాంత్‌రెడ్డి, ఎంబిబిఎస్, ఎండి
బెంగుళూరు రాజరాజేశ్వరి మెడికల్ కాలేజిలో చదువు పూర్తయిన అనంతరం ఒంగోలు రిమ్స్‌లో పనిచేశారు. ప్రస్తుతం కామాక్షి కేర్ హాస్పిటల్‌లో సేవలందిస్తున్నారు. అన్ని రకాల జ్వరాలు, డెంగ్యూ, నెమ్ము, ఆస్తమ, బిపి, షుగర్, పచ్చకామెర్లు, మూత్ర సమస్యలు, కాళ్లువాపులు, అరికాళ్ల మంటలు వంటి అన్నిరకాల అత్యవసర చికిత్సకు పూర్తికాలం అందుబాటులో ఉంటారు. థైరాయిడ్ సమస్యలకు ప్రత్యేక చికిత్స అందిస్తారు. పురుగు మందు, పాముకాటుకు ప్రత్యేక వైద్యం చేస్తారు.
డాక్టర్ పలుకూరి సురేష్, ఎంఎస్, ఇఎన్‌టి
కర్నూలు మెడికల్ కాలేజిలో 2000-05లో ఎంబిబిఎస్, నారాయణ మెడికల్‌కాలేజిలో 2010లో ఎంఎస్ పూర్తి చేసి 2010-16లో కాటూరి మెడికల్ కాలేజిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం కామాక్షి కేర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. ముక్కు వంకర సరిచేయుట, చెవిలో చీము కారుట, చెవులలో రంద్రాలను సరిచేయుట, ముక్కుదూలం వంకరలను సరిచేయుట, వినికిడి లోపం ఉన్నవారికి ప్రత్యేక వైద్యం అందిస్తారు.
డాక్టర్ గవిని లక్ష్మినారాయణ, ఎంఎస్
గుంటూరు మెడికల్ కాలేజిలో 2006-12మద్య ఎంబిబిఎస్ పూర్తి చేసుకుని 2014-17బెంగుళూరు కిమ్స్ మెడికల్ కాలేజిలో ఎంఎస్ చేశారు. రాజీవ్ గాంధీ యూనివర్శిటీ స్టేట్ 3వ ర్యాంక్ సాధించారు. 2017 ఆగష్టు నుండి 2018మార్చి వరకు ఒంగోలు రిమ్స్‌లో పనిచేసి అనంతరం ప్రస్తుతం కామాక్షి కేర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. 24గంటల కడుపునొప్పి, పసర తిత్తిలో రాళ్లు, హెర్నియా, వరిబీజం, కోత, కుట్లు లేకుండా ఆత్యాధునిక మైన లాప్రోస్కోపి వంటి అన్ని రకాల ఆపరేషన్లు చేయడం ప్రత్యేకత. ఎన్‌టిఆర్ వైద్యసేవ ద్వారా ఉచిత ఆపరేషన్లు చేస్తారు.