టంగుటూరు : ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు 11వ వర్థంతి సందర్భంగా తూర్పునాయుడుపాలెంని దామచర్ల విగ్రహానికి, సంతాప సభ వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి కలెక్టర్ వినయ్‌చంద్, కొండపి ఎంఎల్ఎ డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయులు, టిడిపి జిల్లా అధ్యక్షులు, ఒంగోలు ఎంఎల్ఎ దామచర్ల జనార్ధన్, ఎర్రగొండపాలెం ఎంఎల్ఎ పాలపర్తి డేవిడ్‌రాజు, టిడిపి నాయకులు దామచర్ల సత్య, దామచర్ల పూర్ణచంద్రరావు నివాళులర్పించారు. అనంతరం జరిగిన సంతాప సభలో దామచర్ల ఆంజనేయులు సేవలను కొనియాడారు.