Home ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టుల్లో ముంద‌స్తు చిచ్చు

కమ్యూనిస్టుల్లో ముంద‌స్తు చిచ్చు

356
0

హైదరాబాద్ : ముందస్తు ఎన్నిక‌ల‌ ఫీవర్ తెలంగాణ‌లో అన్ని పార్టీలను ఆవ‌రించింది. ఎవ‌రికి వారే ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతున్నారు. కమ్యూనిస్ట్‌ నేతల్లో మాత్రం ముందస్తు ఎన్నిక‌ల వేడి చిచ్చురేపాయి. ఎవ‌రి దారి వారిదే అన్న‌ట్లు సిపిఎం, సిపిఐ చెరోదారి చూసుకున్నాయి. రానున్న‌ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశాలు లేవని సీపీఐ నేత‌లు ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండాలంటే టీఆర్ఎస్‌ వ్యతిరేక కూటమితో కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

అయితే సీపీఐ చేసిన ప్రకటనను సీపీఎం నేతలు తోసిపుచ్చారు. కాంగ్రెస్‌కు తాము వ్యతిరేకమని సీపీఎం నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ భాగ‌స్వామ్యంతో ఉన్న కూటమిలో తాము కలవబోమని సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. జనసేనతో పొత్తుకు సీపీఎం సిద్ధంగా ఉందన్నారు. బిఎల్ఎఫ్‌ కూటమి ఇదివ‌ర‌కే ఏర్పాటు చేసినట్లు సీపీఎం పేర్కొంది. సీపీఐ మాత్రం బిఎల్ఎఫ్‌కు దూరంగా ఉంటూ కోదండరాంతో కలిసి వెళ్లనున్నట్లు సీపీఎం నేతలు సంకేతాలిచ్చారు.