యద్దనపూడి (DN5 News) : పర్చూరు శాసన సభ్యలు ఏలూరి సాంబశివరావు సిఫారసుతో మండలంలోని పూనూరుకు చెందిన గోదాసి రాజ్యలక్ష్మి అత్యవసర చికిత్స కోసం మంజూరైన రూ.6లక్షల సిఎం సహాయ నిధి ఎల్‌ఒసిని ఇసుకదర్శిలోని ఎంఎల్‌ఎ క్యాంప్ కార్యాలయంలో టిడిపి నాయకులు మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, క్యాంపు కార్యాలయ ప్రతినిధులు పాల్గొన్నారు.






