చీరాల : విద్యార్ధులు భగవద్గీత చదవడం వల్ల ఆత్మస్థైర్యం, దేశభక్తి కలుగుతుందని డిటిఆర్ స్కూల్ ప్రిన్సిపాల్ గాదె సాయి పేర్కొన్నారు. దేవాంగపురి పంచాయితీ వాసవి నగర్‌లోని భగవత్ భక్తి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా శిభిరంలో ఆయన మాట్లాడారు. విద్యార్ధులకు చిత్రలేఖనం, వ్యాసరచన, డాన్స్ పోటీలు నిర్వహించి విద్యార్ధుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధుల వసంత, ఉపాధ్యాయులు ధర్మవరపు వెంకటరమణ, గుగ్గిలం హనుమంతరావు, బి మోహన్‌రావు పాల్గొన్నారు.