Home ప్రకాశం తీరప్రాంత నేరాలపై మత్స్యకారులకు అవగాహన

తీరప్రాంత నేరాలపై మత్స్యకారులకు అవగాహన

395
0

చీరాల : మత్స్యకారులుకు, వాడరేవు గ్రామ ప్రజలకు మెరైన్ పోలీసులు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ సంజీవరావు మాట్లాడుతూ శని, ఆదివారాలలో సముద్ర తీరానికి పర్యాటకుల తాకిడి ఎక్కువ ఉండటం వల్ల చిల్లర దొంగత్తనాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఇలాంటి చోరీలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆదే విధంగా పర్యాటకులు సముద్రంలోనికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే గజ ఈతగాళ్లను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. పర్యాటకులు కూడా అప్రత్తమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.