Home ప్రకాశం హెల్మెట్ ధరించకపోతే….

హెల్మెట్ ధరించకపోతే….

465
0

చీరాల : హెల్మెట్ ధరించక పోయినా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని మోటారు వాహన తనిఖీ అధికారి కృష్ణారావు అన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం నుండి వేటపాలెం, దేశాయిపేట, దేవాంగపూరి, రామకృష్ణాపురం, ముంటావారీసెంటర్, ఏంజిసి మార్కెట్ మీదుగా గడియారస్తంభం సెంట్రకు బైక్ ర్యాలీ చేరుకుంది.

ఈ సందర్భంగా ఎంవిఐ కృష్ణారావు మాట్లాడుతూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ప్రయాణం చేయడం సురక్షితం అన్నారు. నూతన రవాణా చట్టం ప్రకారం నిబంధాలు పాటించకుంటే లైసెన్సు రద్దు చేయడం, బండి సీజ్ చేయడం, ఫైన్ వేయడంతో పాటు క్రిమినల్ కేసులు, శిక్షలు ఉంటాయని చెప్పారు. అతివేగంగా వద్దన్నారు. ప్రమాదాలు జరగకుండా సురక్షిత ప్రయాణం చేయడం వల్ల వాహన చోదకులతోపాటు వారిపై ఆధారపడిన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు సంతోషంగా ఉంటారని చెప్పారు. నూతన రవాణా చట్టంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.