Home జాతీయం అరుణ్ జైట్లీకి మోడీ షాక్… మరో కేంద్ర మంత్రికి కూడా…!

అరుణ్ జైట్లీకి మోడీ షాక్… మరో కేంద్ర మంత్రికి కూడా…!

431
0

ఢిల్లీ :  అరుణ్ జైట్లీకి ఆంధ్రప్రదేశ్ శాపం అయినట్లుగా ఉంది. ఏపీకి చట్ట బద్దంగా రావాల్సిన నిధులు అడిగితే ఏపీకి మీకు రక్షణ నిధులు కూడా కావాలా అని అవహేళనగా మాట్లాడిన అరుణ్ జైట్లీకి మోడీ షాక్ ఇచ్చారు. అరుణ్ జైట్లీ తన నోటితోనే ఏపీకి 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని ఇపౌడు అదే నోటితే హోదా ఇవ్వడం కుదరదు అని చెప్పి ఏపీ ప్రజలను మోసం చేశాడు. సోమవారం రాత్రి మంత్రివర్గంలో మార్పులు చేసి ఆ మోడీ ఆర్ధిక మంత్రి జైట్లీకి షాకిచ్చారు. ఆయన్ని ఆర్థిమ మంత్రిగా తొలగించారు. ఆయన బాధ్యతల్ని మరొకరికి అప్పగించారు. అలాగే వివాదాలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి గట్టి ఝలక్‌ ఇచ్చారు. ఆమెను సమాచార ప్రసార శాఖ నుంచి తప్పించారు. కేవలం జౌళి శాఖకు మాత్రమే ఆమెను పరిమితం చేశారు. ఇలా ఓ కీలక శాఖను స్మృతి కోల్పోవడం ఇది రెండోసారి. గతంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి కూడా ఆమెను తీసేసి జౌళి శాఖ కట్టబెట్టారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కావడంతో- సమాచార శాఖను కూడా అదనంగా అప్పగించారు.

సమాచార శాఖ నిర్వహణలో విఫలమై విమర్శలు ఎదుర్కోన్న స్మృతిని ఆ బాధ్యతల నుంచి తొలగించారు. ఆమె స్థానంలో ప్రస్తుతం అదే శాఖలో సహాయమంత్రిగా ఉన్న రాజ్యవర్థన్‌ రాథోడ్‌కు స్వతం త్ర హోదా కట్టబెట్టి మరీ అప్పగించారు. సోమవారం రాత్రి మంత్రివర్గంలో నాలుగు మార్పులు చేస్తూ ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. అస్వస్థతతో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్థానంలో రైల్వే మంత్రి పీయూష్‌ గోయెల్‌ను ఆర్థిక మంత్రిగా తాత్కాలికంగా నియమించారు. జైట్లీ తిరిగి వచ్చేదాకా ఆయన ఈ శాఖ చూస్తారు. పీయూష్‌ గోయెల్‌పై బ్యాంకు రుణం ఎగవేత స్కాం ఉన్నప్పటికీ ప్రధాని ఆయనకు ఈ బాధ్యత అప్పగించడం విశేషం.

ఆర్థికశాఖ గుట్టుమట్లు తెలిసిన నిపుణుడు మంత్రివర్గంలో మరొకరు లేకపోవడం కూడా కారణం. ఒకవేళ ఇస్తే నిర్మలా సీతారామన్‌కు ఇవ్వాలి. కానీ రక్షణ శాఖను సమర్థంగా నిర్వహిస్తున్న ఆమెను మళ్లీ ఈ వైపు తీసుకురావడం ప్రధానికి ఇష్టం లేదేమో. నిజానికి గత కొంతకాలంగా కిడ్నీ, లివర్‌ సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతున్న అరుణ్‌ జైట్లీని తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినప్పటికీ పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నారు. కాగా త్రాగునీరు పారిశుధ్ద్య మంత్రిగా ఉన్న ఎస్‌ఎస్‌ ఆహ్లూవాలియాను ఆ శాఖ నుంచి తప్పించి ఎలక్ర్టానిక్స్‌ మంత్రిత్వ శాఖకు మార్చారు.

ఎలక్ర్టానిక్‌ శాఖను అదనంగా నిర్వహిస్తున్న కేటీ ఆల్ఫాన్స్‌ పర్యాటక మంత్రిత్వ శాఖకే పరిమితం చేశారు. ప్రధాని స్మృతీ ఇరానీని సమాచార శాఖ నుంచి తప్పించడానికి కారణాలు అనేకం ఉన్నట్లు చెబుతున్నారు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానం కార్యక్రమాన్ని 70 మంది సినీ కళాకారులు బహిష్కరించడానికి ఆమె కారణమయ్యారు. తాను గంటసేపు కంటే ఎక్కువ సేపు విజ్ఞాన్‌ భవన్‌లో ఉండడని, 11మందికి మాత్రమేఅవార్డులు అందజేస్తానని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎంతో ముందుగా చెప్పినా ఆమె ఆ విషయాన్ని ఆర్టిస్టులకు తెలియజేయకపోవడం వివాదానికి కారణమయ్యింది. రాష్ట్రపతి కూడా సమాచార శాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై ఆమె విధించిన నియంత్రణను ఒక దశలో ప్రధానమంత్రి కార్యాలయం రద్దు చేయాల్సి వచ్చింది. ఫేక్‌ న్యూస్‌ను వ్యాప్తి చేసే జర్నలిస్టుల అక్రిడిషన్‌ రద్దు చేస్తామని ఆమె చేసిన సర్క్యులర్‌ మీడియాలో ప్రకంపనలు రేపింది. ఇక అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో సినిమాలను ఎంపిక చేయాల్సిన జ్యూరీ సభ్యులు తమ బాధ్యతను నిర్వర్తిస్తున్న తరుణంలో మధ్యలోనే ఆమె ఆ జ్యూరీని రద్దు చేశారు.

ఐఐఎస్ కు చెందిన అనేకమంది అధికారులను ఇష్టారాజ్యంగా బదిలీ చేశారు. తాను చెప్పిన వారిని సలహాదారులుగా నియమించని ప్రసార భారతి సంస్థలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు కొద్ది కాలం నిలిపివేయించారు. దీంతో తమ స్వతంత్ర ప్రతిపత్తిని సమాచార శాఖ హరిస్తోందని ప్రసార భారతి గళమెత్తింది. సహాయమంత్రి రాజ్‌ వర్ధన్‌ రాథోడ్‌ కనీసం సొంతంగా డ్రైవర్‌ను కూడా నియమించుకోలేక స్మృతి ఇరానీ ఆదేశాలకోసం వేచి చూడాల్సి వచ్చింది. ఆరెస్సెస్ కు చెందిన పెద్దలు కూడా ఆమె వ్యవహార శైలిపై ఫిర్యాదు చేయడం, ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్‌ జైట్లీ కూడా ఆమె వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో చివరకు ఆమెను మళ్లీ తప్పించాల్సి వచ్చిందని చర్చిస్తున్నారు.