Home ఉపాధి డిఎస్సి లేనట్లేనా…? సర్కారు నిర్లక్ష్యం… నిరుద్యోగుల జీవితాలతో చేలగాటం…

డిఎస్సి లేనట్లేనా…? సర్కారు నిర్లక్ష్యం… నిరుద్యోగుల జీవితాలతో చేలగాటం…

550
0
- డిఎస్సి డైలామా... ఏపీ సర్కారు నిర్లక్ష్యం... 
- ఎప్పుడిస్తారో తెలియని నోటిఫికేషన్....
- కుటుంబాలకు దూరంగా శిక్షణలో నిరుద్యోగులు...
- అవనిగడ్డలోనే వేలాది మంది
- అప్పులపాలవుతున్న వేలాది కుటుంబాలు

చీరాల : డీఎస్సీ ప్రహసనంగా మారింది. రోజుకో ప్రకటనతో నిరుద్యోగులను ఉరిస్తున్నారు. తొలుత 12వేల పోటీసులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆతర్వాత 9వేల పోస్టులు అని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రకటనకు ఆర్థిక శాఖ అనుమతి లేదన్నారు. ఆ అనుమతి వచ్చాక మంత్రివర్గ అనుమతి కావాలన్నారు. మంత్రివర్గం అనుమతించాక పోస్టులు తగ్గించి ప్రకటిస్తామన్నారు. ఇదంతా జరిగి నెల గడుస్తున్నా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు.

గత మూడు నెలలుగా డిఎస్సీపై ఆశతో అభ్యర్థుల్లో కోచింగ్ సెంటర్లలో పుస్తకాలతో కాలం గడుపుతున్నారు. ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తుండటంతో అసలు పోస్టులు ఇస్తారా? లేక ఎన్నికల ప్రకటనగా గాలికొడులుతారా అంటూ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఉషా సెలవుపై వెళతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో ఆందోళన మరింత పెరిగింది. వయస్సు పైబడి చివరి ప్రయత్నాలు చేస్తున్న అభ్యర్థులైతే భార్య, బిడ్డలు, ఇల్లు, వాకిలి వదిలి కోచింగ్ సెంటర్లలో పుస్తకాలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కోచింగ్ కోసం అప్పులు చేసి… ఎప్పుడు ప్రకటన వస్తుందో తీలియక… ఇంకెంత అప్పు చేయాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు 1998లో ఎన్నికలకు ముందు ఇలాగే ఊరించి… ఊరించి డీఎస్సీ ప్రకటించారు. డీఎస్సీ వేశారన్న ఆనందంతో అభ్యర్థులు కోచింగ్ లు తీసుకుని, ఖర్చులు పెట్టుకుని పరీక్షలు రాశారు. ఫలితాలు వచ్చేలోపు ఎన్నికల కోడ్ కూసింది. అంటే నియామకాలు నిలిచిపోయాయి. ఆతర్వాత అధికారానికి వచ్చింది కూడా చంద్రబాబే అయినప్పటికీ నియామకాల వివాదం కోర్టుకెక్కింది. అంటే 98డీఎస్సీ ఇప్పటికి నియామకాలు జరగలేదు. అస్పష్టంగా ప్రభుత్వం ప్రకటనలు చేస్తే అభ్యర్థులు ఎంత తీవ్రంగా నష్టపోతారో అర్ధం చేసుకోవచ్చు.

ఒక్క అవనిగడ్డ డీఎస్సీ కోచింగ్ సెంటర్లలోనే వేలాది మంది పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. వీరితోపాటు కనిగిరి, నంద్యాల వంటి ఇతర పట్టణాల్లో సైతం వేల మంది అభ్యర్థులు డీఎస్సీ కోసం శిక్షణ పొందుతున్నారు. ఇలాంటి అభ్యర్థులకు ప్రభుత్వం నిర్దిష్ట ప్రకటన చేయకుంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం నిరుద్యోగుల ఆగ్రహాన్ని రానున్న ఎన్నికల్లో చూడాల్సి వస్తుంది.