Home ప్రకాశం అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎంఎల్ఎ ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌

అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎంఎల్ఎ ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌

751
0

చీరాల : ప్ర‌కాశం జిల్లా చీరాల ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ రోడ్డులో అన్నా క్యాంటీన్ ను ఎమ్యెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం ప్రారంభించారు. అన్న క్యాంటీన్ ప్రారంభ సభలో ఎమ్యెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడారు. అన్న ఎన్టీఆర్ స్పూర్తితో పేదల ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన క్యాంటీన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతిరోజు పుటకు 300మంది చొప్పున రూ.5లకే టిఫిన్, భోజనం వడ్డీస్యున్నట్లు తెలిపారు. పేదలకు అందుబాటులో ఉండేలా తొలిదశలో హైస్కూల్ రోడ్డులో రెండోదశలో ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సభలో మునిసిపల్ చైర్మన్ మొదడుగు రమేష్ బాబు, ఎఎంసి చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, సీనియ‌ర్ కౌన్సిల‌ర్ గుద్దంటి స‌త్య‌నారాయ‌ణ‌, కమిషనర్ షేక్‌ ఫజులుల్లా పాల్గొన్నారు.