Home ప్రకాశం ఎఐఐఇఎ ఆధ్వ‌ర్యంలో అన్న‌దానం

ఎఐఐఇఎ ఆధ్వ‌ర్యంలో అన్న‌దానం

382
0

చీరాల‌ : ఎల్ఐసి ఉద్యోగుల యూనియన్ ఎఐఐఇఎ, ఐసిఇయు ఆధ్వర్యములో మంగ‌ళ‌వారం వైకుంఠ‌పురంలోని మహిళామండలి వృద్ధాశ్రమములో వృద్దుల‌కు భోజనం ఏర్పాటు చేశారు. యూనియ‌న్ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా సేవా కార్య‌క్ర‌మాల్లో భాగంగా అన్న‌దానం చేస్తున్న‌ట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎఐఐఇఎ జిల్లా కార్యదర్శి ఆర్‌విఎస్ రామిరెడ్డి, చీరాల‌ బ్రాంచ్ అధ్యక్షులు టి విజ‌య‌కుమార్‌, కార్యదర్శి బి నాగేశ్వరరావు, సిఐటియు కార్యదర్శి ఎన్‌ బాబురావు, సిబ్బంది పాల్గొన్నారు. ఈనెల 4న బుధ‌వారం రోజు ఎల్ఐసి కార్యాల‌యంలో ర‌క్త‌దాన శిభిరం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.