Home ప్రకాశం విత్త‌న ఎంపిక‌, కొనుగోలులో మెళుకువ‌లు పాటించ‌కుంటే…

విత్త‌న ఎంపిక‌, కొనుగోలులో మెళుకువ‌లు పాటించ‌కుంటే…

362
0

చీరాల : విత్త‌న ఎంపిక‌, కొనుగోలులో మెళుకువలు పాటించాల‌ని వ్య‌వ‌సాయాధికారిణి ఇ ఫాతిమ రైతులకు సూచించారు. కీర్తివారిపాలెం, పెర్ల‌వారిపాలెం గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. మూడేళ్ల‌కోసారి విత్త‌నం మార్చి, దృవీక‌రించిన విత్త‌నాలే వాడాల‌న్నారు. లైసెన్సు ఉన్న డీల‌ర్ల వ‌ద్ద‌నే విత్త‌నాలు కొనుగోలు చేయాల‌న్నారు. విత్త‌నం కొనేట‌ప్పుడు ట్యాగ్ రంగుతోపాటు నెంబ‌రు, తేదీ చూసుకోవాల‌న్నారు. బిల్ల‌లు త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని చెప్పారు. జింకు లోపం ఉన్న నారుమ‌డుల‌కు జింక్ ఐదు గ్రాములు క‌లిపి పిచికారీ చేయాల‌న్నారు. ఇనుము లోపం స‌వ‌ర‌ణ‌కు అన్న‌బేరి 20గ్రాములు, ఉప్పు క‌లిపి పిచికారీ చేయాల‌న్నారు. పంట సాగు చేసే రైతులు పొలం ఫోటోను ఈ పంట‌ల విధానంలో న‌మోదు చేయించుకుంటేనే పంట‌ల భీమా, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు వ‌ర్తిస్తాయ‌ని చెప్పారు. కార్య‌క్ర‌మంలో వ్య‌వ‌సాయ విస్త‌ర‌ణాధికారులు ఎన్ సాంబ‌శివ‌రావు, సిహెచ్ ప్ర‌స‌న్న‌కుమారి పాల్గొన్నారు.