Home ఆంధ్రప్రదేశ్ బిగ్‌బాస్‌పై మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌లో ఫిర్యాదు : టాస్క్‌ పేరుతో వెకిలి చేష్టలు

బిగ్‌బాస్‌పై మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌లో ఫిర్యాదు : టాస్క్‌ పేరుతో వెకిలి చేష్టలు

553
0

హైదరాబాద్‌ : బిగ్‌ బాస్ టివి షోపై మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్‌సీ)లో ప్ర‌జాప్ర‌యోజ‌న‌ ఫిర్యాదు దాఖలైంది. ఓ టీవీ చానల్‌లో బిగ్‌ బాస్ షో ప్ర‌సారం చేస్తుంది. అందులో టాస్క్‌ల పేరుతో వెకిలి చేష్టలు చేస్తు, వాటినే ప్ర‌జ‌ల‌కు చూపిస్తూ, స‌మాజాన్ని క‌లుషితం చేస్తున్నార‌ని ఆరోపిస్తూ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్‌ ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచే విధంగా ఈ షో ఉందని ఆరోపించారు. బిగ్‌బాస్ ప్రోగ్రాం పేరుతో 16మందిని ఒకే ఇంట్లో నిర్బంధించి, అనవసరమైన వెకిలి చేష్టలను ప్రసారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి షోల‌తో ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తున్నార‌ని పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆయ‌న‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

పార సంస్థలతో కలిసి టివి యాజమాన్యం తమ లాభాలు, టీఆర్పీ రేటింగ్‌ల కోసం బిగ్ బాస్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు. ఒకే ఇంట్లో ఉంటున్న ఎవరికీ కనపడని బిగ్ బాస్ బాత్రూమ్‌లు కడగాలని, తాను చెప్పినట్టు చేయాలని ఆ ఇంట్లో ఉన్న 16మంది పోటీదారులను బానిసల్లా పరిగణిస్తూ ఆదేశాలివ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఆ షోలో పాల్గొన్నవారిని బయటకు పోనివ్వకుండా వారంద‌రినీ ఒకే ఇంట్లో ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు. టాస్కుల పేరుతో చెడు సంప్రదాయాలను చూపిస్తున్నార‌ని, దీనివ‌ల్ల‌ సమజానికి నష్టం చేజ‌రుగుతుంద‌ని వివ‌రించారు. చిలిపి టాస్కులు, సహజీవనం కాన్సెప్టుతో ఉన్న ప్రోగ్రాములు సమాజానికి నష్టం చేయ‌డంతోపాటు టివి చూస్తున్న పిల్ల‌ల మ‌న‌సుల‌ను క‌లుషితం చేస్తాయ‌ని పేర్కొన్నారు. ఇలాంటి ప్రోగ్రాములు చూసిన వాళ్లు మానసిక వేదన, మానసిక ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉందని సూచించారు.