Home క్రైమ్ వేటపాలెం బైపాస్ రోడ్డులో ఆటో – లారీ ఢీ : ఒకరు మృతి, నలుగురికి గాయాలు

వేటపాలెం బైపాస్ రోడ్డులో ఆటో – లారీ ఢీ : ఒకరు మృతి, నలుగురికి గాయాలు

420
0

వేటపాలెం : బైపాస్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మోటుపల్లి పంచాయతీ కుంకుడుచెట్లపాలెం కు చెందిన వడ్లమూడీ యలమంద(31) మృతి చెందగా ఆటోడ్రైవర్ తోసహా నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. బాపట్లలో గొర్రెలు కొనుగోలు చేసేందుకు నలుగురు కుంకుడుచెట్లపాలెం నుండి ఆటోలో బయలుదేరారు.

ఆటో బైపాస్ రోడ్డులో వెళుతుండగా తూర్పుగోదావరి జిల్లా నుంచి రొయ్యల లోడుతో వెళుతున్న లారీ ఆటోను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న ఒకరు అక్కడికి అక్కడే మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.