కందుకూరు : ఆర్ధిక లోటుతో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, రాజధాని నిర్మాణం, పట్టిసీమ పూర్తిచేయడం, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వంటి పనులతో నవ్యంద్ర నిర్మాణాన్ని పూర్తిచేయగలిగే సమర్ధత చంద్రబాబు నాయుడు మాత్రమే ఉన్నాయని టిడిపి శిక్షణా కేంద్రం డైరెక్టర్ దాసరి రాజా మాస్టారు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలను కోరారు. స్థానిక తెలుగు విజయం ప్రాంగణంలో శిక్షణకు హాజరైన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. శిక్షణలో తెలుసుకున్న అంశాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకొని వెళ్లాలని కోరారు. ఒక మంచి నాయకునిగా ఎదగాలని సూచించారు. 2019లో మరలా చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయాలన్నారు. జగన్ సీఎం అవుతాడని భ్రమలలో ఉన్నారని చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత వైస్సార్సీపీ మూతపడడం ఖాయమన్నారు. నాలుగు సంవత్సరాల కాలంలో టిడిపి ప్రభుత్వం అమలు పరచిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామంలో ప్రతి ఇంటికి వివరించాలన్నారు. అందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై వైస్సార్సీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు.
కార్యకర్తల సంక్షేమం కోసం నారా లోకేష్ విశేషమైన కృషి చేస్తున్నారన్నారు. కార్యకర్తల సంక్షేమ విభాగం సమన్వయకర్త గా గడిచిన 4 సంవత్సరాల కాలంలో కార్యకర్తల ఆరోగ్యం, ఆర్ధిక సహాయం, విద్య, పెన్షన్‌లకు సంబంధించి దాదాపు 26 వేల దరఖాస్తులను పరిష్కరించారన్నారు. కార్యకర్తల పిల్లల కోసం కృష్ణ జిల్లా చల్లపల్లిలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేసారన్నారు. కార్యకర్తల కుటుంబాలలో వారి పిల్లల వివాహాలకు కొంత ఆర్ధిక సహాయంతో పాటు, పట్టు వస్త్రాలను బహుకరించారని, తల్లిలా కార్యకర్తలను చూసుకుంటున్న పార్టీ టీడీపీ అన్నారు. అటువంటి పార్టీలో కుటుంభ సభ్యులుగా ఉండడం మన అదృష్ట అన్నారు. ఈ శిక్షణకు గుంటూరు జిల్లా నుండి వినుకొండ, వేమూరు, సత్తెనపల్లి, తెనాలి, గురజాల, ప్రకాశం జిల్లా నుండి మార్కాపురం, దర్శి, గిద్దలూరు, కొండపి, నెల్లూరు జిల్లా నుండి సర్వేపల్లి, సూళ్ళురుపేట నియోజకవర్గాల జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శిక్షణ శిభిరం కోఆర్డినేటర్ కాకర్ల మల్లిఖార్జున్, శిక్షకులు పాపారావు పసుపులేటి, పరమేశ్వర రెడ్డి చిట్టెం పాల్గొన్నారు.