టంగుటూరు : పోతుల చెంచయ్యనగర్ 4వ సచివాలయం వద్ద ఇందిరా గాంధీ గ్రామ సమైక్య అధ్యక్షురాలు ముద్రగడ పద్మ ఆధ్వర్యంలో వైస్సార్ ఆసరా పథకం కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో సున్నావడ్డీతో రుణమాఫీ చేస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ రుణమాఫీ చేశారని మాజీ సర్పంచ్ పుట్టా వెంకట్రావు అన్నారు. జగనన్న చేయూత సంబరాల కేక్ కట్ చేసి జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా పుట్టా వెంకట్రావు మాట్లాడుతూ వైస్సార్ ఆసరా పథకం ద్వారా ఇందిరా గాంధీ గ్రామైక సంఘం మహిళలకు రు.35లక్షలు రుణమాఫీ పొందారన్నారు. ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు. మహిళలకు జగన్ చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఇందిరా గాంధీ గ్రామైక సంఘం మహిళా సభ్యులు ముద్రగడ రవణమ్మ, షేక్ అసీనా, దర్గా రమ్ తున్ షా, ముద్రగడ లక్ష్మీరాజ్యం, సాదు శ్రీలక్ష్మి, పుట్టా సుజాత, కాలనీవాసులు పుట్టా రాంబాబు, పులిచర్ల కిరణ్, పులిచర్ల కోటిరెడ్డి, పులిచర్ల చంద్ర, పులిచర్ల హరీష్, ముద్రగడ రాజశేఖర్, షేక్ నజీర్ పాల్గొన్నారు.