చీరాల : ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రభుత్వ ఏరియా వైద్యశాలలు కరోనా రోగులకు చికిత్స కోసం ప్రత్యేక వార్డు ని ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వైరస్ సోకిన వారికి శ్వాస, ఛాతీ సంబందించిన ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి రోగులకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ వైద్యశాలలో శ్వాస, ఛాతి, షుగర్ వైద్య నిపుణులు డాక్టర్ పోతుల సమర్ నియమితులయ్యారు. ప్రస్తుతం కరోనా ప్రత్యేక వార్డులో ఆయన వైద్య సేవలు అందిస్తున్నారు.