Home ప్రకాశం శిశు మరణాలు తగ్గించడానికి నియోనాటల్ అంబులెన్స్ సద్వినియోగం చేసుకోండి

శిశు మరణాలు తగ్గించడానికి నియోనాటల్ అంబులెన్స్ సద్వినియోగం చేసుకోండి

206
0

ఒంగోలు : 108అంబులెన్స్‌ సేవల్లో భాగంగా మన జిల్లాకు 59అంబులెన్స్ లు కేటాయించారు. వీటిలో రెండు నియోనాటల్ అంబులెన్స్‌లు మార్కాపురం, కందుకూరుకు కేటాయించారు. నవజాత శిశు మరణాలు తగ్గించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నియోనాటల్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు ప్రవేశపెట్టిందన్నారు.

గత రెండు నెలల కార్యకలాపాల సమయంలో జిల్లాలో నియోనాటల్ అంబులెన్సుల వినియోగం చాలా తక్కువని గుర్తించారు. నియోనాటల్ అంబులెన్స్ వినియోగాన్ని మెరుగుపరచడానికి, ప్రభుత్వం ప్రసూతి కేంద్రము, సమీప SNCU (Special Neonatal care Unit), సేవల కోసం అందుబాటులో ఉన్న నియోనాటల్ అంబులెన్స్‌ల సమాచారంతో ఉన్న  పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో  చీరల ఏరియా వైద్య శాల సూపర్డెంట్ శేషు కుమార్, 108 సర్వీస్ జిల్లా ఎగ్జిక్యూటివ్స్ శీలం సుబ్బారావు , 104జిల్లా ఇంచార్జ్ పీర్ల శివరాకేష్, పైలెట్ చంద్రశేఖర్, ఈఎంటి చంద్రగిరిష్ బాబు, నియోనాటల్ అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.