చీరాల : ఇటీవల మృతి చెందిన చేనేత కార్మికుల కుటుంబాలకు పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. తోటవారిపాలెంలో ఆర్ధిక ఇబ్బందులతో దామర్ల శ్రీనివాసరావు మగ్గానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన కుటుంబానికి పద్మశాలి సంఘం ప్రతినిధులు రూ.8వేలు ఆర్థిక సహాయం అందజేశారు.
పేరాల జవహర్ నగర్ కు చెందిన గట్టు దుర్గారావు కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో మృతిచెందారు. దుర్గారావు కుటుంబానికి పద్మశాలి సంఘం ప్రతినిధులు రూ.8వేలు ఆర్థిక సహాయం అందించారు.
వేటపాలెం రామనగర్ కు చెందిన గాత్రం సుబ్బారావు కుటుంబానికి రూ.8వేలు ఆర్థిక సహాయం చేశారు. ఆర్థిక సహాయం అందించిన వారిలో బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య, పద్మశాలి సంఘం సెంట్రల్ కమిటీ సభ్యులు గోలి మల్లికార్జున, డాక్టర్ జివి పున్నరావు, ఊట్ల వెంకటేశ్వర్లు, ఈపురుపాలెం మాజీ ఎంపీటీసీ గోలి ఆనందరావు, గోలి దేవేందర్ నాద్, కటకం జగదీష్, చీరాల మండలం మాజీ ఉపాధ్యక్షులు నాదెండ్ల కోటేశ్వరరావు, అనుబం సాంబశివరావు, ఉడత రమేష్, గోలి శ్రీనివాసరావు ఉన్నారు.