ఒంగోలు : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ పిలుపు నిచ్చారు. ఆదివారం ఒంగోలు ప్రకాశం భవనంలో టంగుటూరి ప్రకాశo పంతులు 149వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, జాయింట్ కలెక్టర్ జెవి మురళి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశము పంతులు సేవా స్పూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. ప్రకాశం పంతులు కడు పేదరికములో పుట్టినప్పుటికీ పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరారన్నారు. మహోన్నత ఆశయాలతో జీవితాన్ని కొనసాగించారన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొనారన్నారు. సైమన్ కమిషన్ తుపాకులకు ఎదురుగా నిలిబడిన మహా వ్యక్తి అని అన్నారు.
ఉమ్మడిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. రాష్ట్రనికి ఆయన చేసిన సేవలు యువతకు రోల్ మోడల్ గా నిలిచాయన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశము పంతులు పేరును చిర కాలంగుర్తు ఉండే విధంగా ప్రకాశము జిల్లాను ఏర్పాటు చేసారన్నారు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశము పంతులు మనుమడు టంగుటూరి గోపాలకృష్ణను శాలువాతో జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, జాయింట్ కలెక్టర్ జెవి మురళి, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకము, సిపిఓ వెంకటేశ్వర్లు, డిపిఓ నారాయణరెడ్డి, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, డ్వామా పిడి శీనా రెడ్డి, ఐసిడిఎస్ పిడి లక్ష్మీదేవి, బిసి సంక్షేమ శాఖ అధికారి అంజల, ఒంగోలు ఆర్డిఓ ప్రభాకరరెడ్డి, పిడిసిసి బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.