చీరాల : దళిత ముద్దుబిడ్డ, వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూడో ఆర్థిక ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ యాతం ఆనందరావుకు వైసిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి, బిసి కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య, ఎమ్యెల్సీ పోతుల సునీత, పోతుల సురేష్, ఎఎంసి మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు నివాళులర్పించారు. పేరాలలోని ఆనందరావు నివాసంలో మృత దేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆనందరావు మన నుండి భౌతికంగా దూరం కావడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థించారు. యాతం ఆనందరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ చేశారు. ఆనందరావు కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. నివాళి అర్పించిన వారిలో మాజీ ఎంపీపీ దామర్ల శ్రీకృష్ణ, మాజీ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు, దేవరపల్లి బాబురావు, దేవరపల్లి కుమార్ బాబు, బిట్రా శ్రీనివాసరావు, షేక్ మస్తాన్, శీలం వెంకటేశ్వర్లు, షేక్ ఇస్మాయిల్, షేక్ సుభాని ఉన్నారు.