చీరాల : శరీరం దృఢంగా ఉంటే మెరుగైన ఆరోగ్యం పొందవచ్చునని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి పేర్కొన్నారు. ఫిట్ ఫర్ ఫ్రీడం ఇండియా కార్యక్రమంలో భాగంగా మంగళవారం విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల క్రీడా మైదానంలో రెండు కిలోమీటర్ల పరుగును ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా అమృతపాణి, జీఆర్పీ ఎస్సై నాగరాజు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కేంద్ర క్రీడా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ రెండు కిలోమీటర్లపైగా వాకింగ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో షేక్ హుమయూన్ కబీర్ వివిధ ఆటలకు చెందిన క్రీడాకారులు చిన్నారులు, కోచ్ లు ప్రసాద్, శరత్, శాంతి, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.