చీరాల : ప్రకాశం జిల్లా చీరాల మండలం ఓడరేవు పంచాయతీలో పారిశుధ్య కార్మికులకు ఓడరేవు శ్రీరామానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సిబ్బంది నిత్యావసర సరుకులను, ఎన్ 95 మాస్క్ లు, సానిటైసర్ లను పంపిణీ చేశారు. అదేవిధంగా వేటపాలెం మండలానికి చెందిన యాభై మంది వికలాంగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఓడరేవు పంచాయతీకి దోమల ఫాగింగ్ మిషన్ ను అందచేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు వారి ప్రాణాలకు తెగించి మరీ సేవ చేస్తున్నారని వారికి చేదోడు, వాదోడుగా వుండేందుకు ట్రస్ట్ తరపున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. తమకు అండగా నిలిచిన రామానంద ట్రస్ట్ వ్యవస్థాపకులు రామానంద సరస్వతి స్వామీజీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, మేనేజర్ నారాయణం సురేష్, ఎంజీ శంకర్రావు, సిహెచ్ వరలక్ష్మి, ఐవి రామారావు, పి కామేశ్వరరావు, శర్మ పాల్గొన్నారు.