Home ప్రకాశం యుటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ

యుటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ

245
0

చీరాల : ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 47వ ఆవిర్భావ దినోత్సవం స్థానిక ఎన్జీవో హోం నందు ఘనంగా నిర్వహించారు. యుటిఎఫ్ సీనియర్ నాయకులు గవిని నాగేశ్వరావు, ఎయిడెడ్ కన్వీనర్ కె వీరాంజనేయులు పతాకావిష్కరణ చేశారు. గవిని నాగేశ్వరరావు మాట్లాడుతూ 1974లో ఆగస్టు 10న ఏర్పడిన సంఘం ఉపాధ్యాయుల సంక్షేమానికి పాఠశాల పరిరక్షణకు అలుపెరుగని పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం, ఎమ్మెల్సీలు కలిగిన ఘనమైన సంఘం యుటిఎఫ్ అని కె వీరంజనేయులు పేర్కొన్నారు.

యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ జానిబాషా మాట్లాడుతూ అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ యుటిఎఫ్ యొక్క ఆశయాలుగా, హక్కులు బాధ్యతలు రెండు నేత్రాలుగా కలిగిన యుటిఎఫ్ ఆశయాల సాధనకు బాధ్యతల నిర్వహణకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నూతన జాతీయ విద్యా విధానంలో లోపాలను ప్రతిఘటించాలని కోరారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్ర రామారావు, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి జి సూరిబాబు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను నిశితంగా పరిశీలించి ప్రతిఘటించాలని కోరారు. కార్యక్రమంలో కొప్పోలు సుబ్బారావు, చీరాల పట్టణ శాఖ నాయకులు కుర్ర శ్రీనివాసరావు, పి సురేష్, ఎన్ రాజేష్, సిహెచ్ వెలుగొండరెడ్డి, సయ్యద్ జానీభాష, చీరాల మండల శాఖ నాయకులు బి బాలచందర్రావు, మల్లెల రవి, ప్రభాకర్, శ్రీనివాసరావు, లూకా, హేమంత్ కుమార్, బండి భిక్షాలుబాబు, వేటపాలెం నాయకులు బుర్ల వెంకటేశ్వర్లు, మురళి, ఈమని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.