చీరాల : ఇటీవల అకాలమరణం చెందిన ఎస్కెపిఎ యుపి ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాఠశాల కరెస్పాండెంట్ ఎస్ శంకరబాబు కుటుంబానికి యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి కొమ్మోజు శ్రీనివాసరావు చేతులమీదుగా రూ.1,50,000/- యుటిఎఫ్ కుటుంబ సంక్షేమ సంఘీభావ విరాళాన్ని అందించారు. విద్యారంగ అభివృద్ధికి ఎయిడెడ్ యాజమాన్యం ఎంతో కృషిచేస్తుందన్నారు. పాఠశాల ప్రారంభం నుండి నేటివరకు పాఠశాల అభివృద్ధికోసం శంకరబాబు చేసిన కృషిని గుర్తు చేశారు.
యుటిఎఫ్ వ్యవస్థాపకులు దాచురి రామిరెడ్డి ఆలోచన నుండి పుట్టిన కుటుంబ సంక్షేమ పథకం ద్వారా ఇప్పటికి సుమారు కోటి యాభై లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని కొమ్మోజి శ్రీనివాసరావు చెప్పారు. ఇటువంటి పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయసంఘం యుటిఎఫ్ మాత్రమేనని వక్తలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు జి సూరిబాబు, షేక్ జానీభాష, జిల్లా కన్వీనర్ కె వీరాంజనేయులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్ర రామారావు, సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, చీరాల మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలచందర్రావు, మల్లెల రవి, పట్టణశాఖ ప్రధానకార్యదర్శి కుర్రా శ్రీనివాసరావు, కోశాధికారి నాగమల్లేశ్వరరావు, మాసెట్టి శ్రీనివాసరావు, హేమంత్ కుమార్, బండి భిక్షాలుబాబు, ఎస్ నాగేశ్వరరావు, పాఠశాల సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.