టంగుటూరు : మండలంలోని యర్రజర్ల గ్రామ సమీపంలోని పొలాల్లో పేకాట శిబిరంపై సింగరాయకొండ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టంగుటూరు ఎస్ఐ వైవి రమణయ్య, కొండపి ఎస్ఐ ప్రసాద్ సంయుక్తంగా తమ సిబ్బందితో కలిసి ఆదివారం అర్ధరాత్రి మెరుపుదాడి చేసి ఇద్దరు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వారివద్ద నుండి 1,37,000 నగదును, మోటారు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఎస్ఐ రమణయ్య తెలిపారు.
ఈ సందర్భంగా టంగుటూరు ఎస్ఐ వైవి రమణయ్య మాట్లాడుతూ మండలంలో పేకాట ఆడేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పేకాట ఆడేవారిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. మండలంలో ఎక్కడైనా పేకాట ఆడుతుంటే పోలీసులకు సమాచారం అందివ్వాలని ప్రజలను కోరారు.
సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.