అగర్తల : మేక్ ఇన్ ఇండియా. స్వచ్ఛ భారత్. మేరా భారత్ వంటి నినాదాలతో దేశభక్తి మీకే ఉన్నట్లు, దేభక్తికి మీరే ప్రతిరూపం అన్నట్లు ప్రచారం చేసుకునే మోడీజీ ఇదేంటి ఇలా చేశారు. వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా ఆదర్శంగా ఉండాల్సిన మీరేంటి ఇలా వ్యవహరించారు? ఎవ్వరైనా గురువులు కనిపిస్తే నమస్కరిస్తారు. కానీ మీరేంటి మీ రాజకీయ గురువకు ఇలాంటి అవమానం మిగిల్చారు. గురువునే గౌరవించలేని మీరు దేశాన్ని ఏలా గౌరవిస్తారుని నమ్మగలం. మీ చేష్టలు చూపి మీరు చెప్పిన మాటలు నెమరువేసుకుంటే ఎంత మోసం చేశారు గుర్తుకొస్తుంది. నోట్ల రద్దుతో నల్లధనం బయటికొస్తుందన్నావు. కానీ నల్లదం దాచుకున్నవాళ్లు, బ్యాంకులకు పంగనామాలు పెట్టినవాళ్లు దర్జాగా విదేశాల్లో విలాసాలు అనుభవిస్తున్న తీరు చూస్తున్నాం. నల్లధం రాలేదు. బ్యాంకుల్లో దాచుకున్న ప్రజల సొమ్ము వాడుకునేందుకు వీలులేకుండా నిబంధనలు పెట్టారు. ఏం వాగ్దానాలండీ… మా చేత్తో మాకళ్లు పొడుకునేలా చేస్తున్నారు. త్రిపుర బిజెపి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార సభలో మీరు అద్వానీకి చేసిన అవమానం మీడియాలో చూశాం. అద్వానీని అవమానించడం అంటే మీ హుందాతనం తగ్గిందా? అద్వానీ గౌరవం పెరిగిందా? ఈ వయస్సులో అద్వానీగారిని అంత క్షోభపెట్టడం అవసరమా? ఆలోచించండి.