Home ప్రకాశం కరోనా వలన ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.10వేల ఆర్ధిక సహాయం ఇవ్వాలి.

కరోనా వలన ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.10వేల ఆర్ధిక సహాయం ఇవ్వాలి.

267
0

ఒంగోలు : కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలందరికీ ఒక్కొక్కరికి రూ.10వేల ఆర్ధిక సహాయం ప్రభుత్వం చేయాలని కోరుతూ పట్టణంలోని 50వ డివిజన్ లో నిరసన వ్యక్తం చేశారు. ఐద్వా, పౌర సంఘాల సమాఖ్య, డైఫీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పౌర సంఘాల సమాఖ్య నగర నాయకులు దారా వేంకటేశ్వర్లు, ఐద్వా నగర కార్యదర్శి కంకణాల రమాదేవి, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు పాతురి సురేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవన భృతి పట్ల నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నాయని ఆరోపించారు.

మోదీ ప్రకటించిన రూ.20లక్షల కోట్లలో ఒక్క రూపాయి కూడా పేద, మధ్యతరగతి ప్రజలకు చేరట్లేదన్నారు. అంతా అంకెల గారడిగానే వుందని అన్నారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లాకార్యదర్శి గంధవల్ల బాలకృష్ణ, ఐద్వా నాయకులు చేజర్ల కల్యాణి, పెద్దేటి రమణ, పసుమర్ధి శైలజ, కందుకూరి సునీత, పౌర సంఘాల సమాఖ్య రామనబోయిన నరసింహారావు, రామదాసు పెంచలకొండయ్య, డైఫీ నాయకులు ధర్నాసి శ్రీను, కందుకురి కొటేశ్వరరావు, శ్రీదర్ల రాజు తదితరులు పాల్గొన్నారు.