Home ప్రకాశం పోలీస్, జర్నలిస్టులకు నిత్యవసర సరుకులు పంపిణీ : వెంకటాద్రి రెడ్డి

పోలీస్, జర్నలిస్టులకు నిత్యవసర సరుకులు పంపిణీ : వెంకటాద్రి రెడ్డి

552
0

కొండపి : జర్నలిస్టులు, పోలీసుల సేవలు ప్రశంసనీయమని పిడిసిసి బ్యాంక్ చైర్మన్, వైసీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ మాదాసి వెంకయ్య అన్నారు. కోవిడ్19 కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ప్రజలను కాపాడే ప్రయత్నంలో తమవంతు కృషి చేస్తున్న జర్నలిస్టులకు, పోలీసులకు కొండపి జడ్పీటీసీ అభ్యర్థిని మారెడ్డి అరుణకుమారి భర్త, కొండపి మండల వైసీపీ నాయకులు బిల్డర్ వెంకటాద్రిరెడ్డి రూ.1.50లక్షల విలువైన నిత్యావసర సరుకులను డాక్టర్ వెంకయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, 5కేజీల నూనె, నిత్యవసర సరుకులు అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ వెంకయ్య మాట్లాడుతూ ఈ కష్ట కాలంలో సైతం జర్నలిస్టులు, పోలీసులు ఎంతో సేవ చేస్తున్నారని, ప్రభుత్వం అన్నీ చేయలేదు కాబట్టి దాతలు ఈ సమయంలో ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సహాయం అందించిన వెంకటాద్రిరెడ్డిని అభినందించారు.

వైసీపీ నాయకులు, బిల్డర్ మారెడ్డి వెంకటాద్రిరెడ్డి మాట్లాడుతూ ఎంత కష్టమైన చోటుకైనా ముందుగా వెళ్ళేది పోలీసులు, జర్నలిస్టులు మాత్రమేనని అన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రభావవంతంగా పనిచేస్తున్న వాళ్లలో ముందుగా చెప్పుకోవాల్సింది జర్నలిస్టులు, పోలీసులని అన్నారు. కర్తవ్య నిర్వహణలో నిరంతరం పనిచేస్తున్న వారి కుటుంబాలకు కొంత భరోసాగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అందులో భాగంగా ఒక నెల సరుకులు అందజేస్తున్నట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో ఎక్కడైనా, ఎవరైనా, ఎంతమందికైనా నిత్యవసర సరుకులు అందజేస్తామని అన్నారు. అవసరమైతే భోజనం తయారు చేసైనా ఆకలిగొన్నవారు ఎక్కడున్నా ఆక్కడివారికి భోజనం పంపించగలమన్నారు. ప్రజలెవ్వరూ ఆకలితో ఉండకూడదన్న జగనన్న స్ఫూర్తితో నిరంతరం సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు.

మండలంలోని డ్వాక్రా మహిళలకు రూ.2లక్షల విలువ చేసే 50టన్నుల అరటిపండ్లను, మాస్కులు, శానిటయిజర్లు, కూరగాయలను పోలీసులు, జర్నలిస్టులు, అధికారులు, పెట్లూరు, నెన్నూరుప్పాడు, మూగచింతల, గుర్రపడియ గ్రామస్తులకు అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు డాకా పిచ్చిరెడ్డి, ఆరికట్ల వెంకటేశ్వర్లు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసులకు నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో డాక్టర్ వెంకయ్య, ఎస్ఐ ఎన్ సి ప్రసాద్, ఎఎస్ఐ హనుమంతరావు, వైసీపీ నాయకులు వెంకటాద్రిరెడ్డి పాల్గొన్నారు.